తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇరాన్​ ప్రతీకారానికి అమెరికా సిద్ధంగా ఉండాలి' - అమెరికాను హెచ్చరించిన ఇరాన్​

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్​ డిప్యూటీ కమాండర్​, రియర్​ అడ్మిరల్​ అలీ ఫడావి అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చిన అమెరికా... అందుకు తగ్గ ప్రతిస్పందనను కోరకుంటోందని వ్యాఖ్యానించారు. ఇరాన్​ ప్రతీకారాన్ని చూసేందుకు అమెరికా సిద్ధంగా ఉండాలన్నారు.

Iran says US asked for proportionate response to general's killing
ఇరాన్​ ప్రతీకారానికి అమెరికా సిద్ధంగా ఉండాలి

By

Published : Jan 4, 2020, 6:41 PM IST

జనరల్ ఖాసిం సులేమానీని హత్యచేసిన అమెరికా అందుకు తగ్గ ప్రతిస్పందనను కోరుకుంటోందని ఇరాన్​ రివల్యూషనరీ గార్డ్స్​ డిప్యూటీ కమాండర్​, రియర్​ అడ్మిరల్​ అలీ ఫడావి వ్యాఖ్యానించారు. మిత్రదేశాలతో కలిసి ఇరాన్​... అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రతీకారం తప్పదు

"అమెరికా ప్రతీకార చర్యలకు దిగితే, ఇరాన్​ కూడా అంతే దీటుగా ప్రతిస్పందిస్తుంది."- రియర్​ అడ్మిరల్​ ఫడావి, బ్రాడ్​కాస్టర్​ వెబ్​సైట్​లో

అమెరికాపై ఇరాన్​ ఏ విధమైన ప్రతీకార చర్యలు తీసుకుంటుందో మాత్రం ఫడావి వెల్లడించలేదు. కానీ ఇరాన్​ ప్రతిస్పందన అమెరికా ఊహించుకోలేని విధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇరాక్​లోని బాగ్దాద్ విమానాశ్రయం నుంచి తన కాన్వాయ్​లో బయలుదేరిన కుర్ద్​ఫోర్స్ జనరల్ సులేమానీని.. యూఎస్​ డ్రోన్​ క్షిపణులతో దాడి చేసి చంపిందని రివల్యూషనరీ గార్డ్స్ ధ్రువీకరించింది.​

యూఎస్​ తరహా దౌత్యం

సులేమానినీ హతమార్చిన తరువాత అమెరికా.. ఇరాన్​తో దౌత్యపరమైన చర్యలకు ప్రయత్నిస్తోందని రియర్​ అడ్మిరల్​ ఫడావి ఆ దేశ జాతీయ టీవీ ద్వారా వెల్లడించారు.

ఇంతకు ముందు ఇరాన్​ విదేశాంగమంత్రి మొహమ్మద్​ జావెద్​ జరీఫ్​, అమెరికా తరఫున రాయబారానికి ప్రయత్నించిన స్విట్జర్లాండ్​ను తీవ్రంగా విమర్శించారు. స్విస్​ అమెరికా తరఫున ఓ అవివేక సందేశాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికా, ఇరాన్​ల మధ్య నాలుగు దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు లేకపోవడం.... తాజాగా ఇరాన్​ రెండో అత్యున్నత నేత సులేమానీని యూఎస్ హతమార్చిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: మండుతున్న సూర్యుడిని తలపిస్తోన్న ఆస్ట్రేలియా

ABOUT THE AUTHOR

...view details