ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే వాళ్లు దేశం నుంచి వెళ్లిపోవాలంటూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కరోనా భయాలతో రెగ్యులర్ తరగతులకు హాజరుకాలేక, చదువును మధ్యలో వదిలిరాలేక నానా అవస్థలు పడుతున్నారు. వీసా స్టేటస్ ఎప్పుడు మారిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి-'అమెరికా వెళ్లే అవకాశం పోయిందని ఆందోళన వద్దు'
సిన్సినాటి విశ్వవిద్యాలయానికి చెందిన బయోఇంజినీరింగ్ విద్యార్థి వర్ధ అగర్వాల్ సైతం తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు. గత సెమిస్టర్లో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం తొలగించడం అన్యాయమని చెబుతున్నారు.
వీసా రాజకీయమే!
ఇమ్మిగ్రేషన్ లాయర్ మంజునాథ్ గోకరే మాత్రం ఈ పాలసీలను రాజకీయ ఎత్తుగడలుగా అభివర్ణించారు. యూనివర్సిటీలను బలవంతంగా ప్రారంభించడానికి, వలసలను తగ్గించడానికి ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలని పేర్కొన్నారు.