తెలంగాణ

telangana

ETV Bharat / international

నేడే.. ప్రపంచ బీరు దినోత్సవం - international beer day

బీర్​.. ఈ పేరు వింటేనే మందుప్రియుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. కాలమేదైనా చల్లటి బీరు తాగితే వచ్చే కిక్కే వేరని వారి అభిప్రాయం. అలాంటి బీరుకీ ఓ రోజుంది. ఈరోజే ప్రపంచ బీరు దినోత్సవం.

బీర్

By

Published : Aug 2, 2019, 1:10 PM IST

Updated : Aug 2, 2019, 2:18 PM IST

'ద్రవ చైతన్య సదస్సులు' పేరు వింటేనే కొందరి మనసులు పులకరిస్తాయి. స్నేహితులు, చుట్టాలు, ఎవరైతేనేం అందరిని ఒక్క తాటిపై కొన్ని గంటల పాటు కూర్చోబెడుతుంది. ఫలవంతమైన చర్చలకు దారి కల్పిస్తుంది. ఇంతకీ ఈ సదస్సులెంటో మీకు అర్థమయ్యిందా? అదేనండీ మద్యం ప్రపంచంలో మద్యానికీ ఒక రోజు ఉంటుందో లేదో కానీ.. బీరుకు మాత్రం ఓ రోజుందండోయ్​.. అదీ ఈ రోజే ఆగస్టు 2. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు మొదటి శుక్రవారాన్ని జరుకోడానికి కారణం ఐరోపా దేశాలలో ప్రస్తుతం వేసవి కాలం కావడమే.

బీరు దినోత్సవం

బీర్ల తయారీ మొదలైన నాటి నుంచి మాల్ట్​ గింజలతో మాత్రమే తయారు చేస్తున్నారు తయారీదారులు. మొదట ఆ గింజల్ని నానబెట్టి, పులియబెడతారు. వాటి నుంచి వివిధ పద్ధతుల ద్వారా బీరు సేకరిస్తారు. ప్రస్తుతం కేవలం మాల్ట్​ గింజల ద్వారానే కాకుండా వివిధ తృణ ధాన్యాలతో ఉత్పత్తి చేయడం ప్రారంభమైంది. గతేడాది మహోవ్​ మేస్ట్రా అనే స్పానిష్​ బీర్ల కంపెనీ భారత్​లో మొదటిసారిగా గోధుమ బీర్లను ఉత్పత్తి చేసింది.

బీరు బీరుకో రకం

బీరంటే స్ట్రాంగ్​, లైట్​ అనే రెండు రకాలు మాత్రమే ఉంటాయనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ దీంట్లోనూ చాలా రకాలున్నాయనేది వాస్తవం. పులియబెట్టే ప్రక్రియలో ఈస్ట్​ అనే శిలీంధ్రాన్ని వాడతారు. అయితే దాన్ని ఎంత మోతాదులో వాడతారనే దాన్ని బట్టి బీర్లను వర్గీకరించారు. లార్జర్లు, గోధుమ బీర్లు, పేల్​ ఏల్స్​, సోర్​ ఏల్స్​ పేరేదైతేనేం... బీరోత్సవం ఘనంగా చేయాల్సిందే.

బీరు దినోత్సవం

సాధారణంగా ఇంట్లో ఏదైనా ఫంక్షన్​ జరిగినప్పుడు ఇరుగుపొరుగు వారిని పిలుస్తాం. మరి వారికి మందు విందు ఇవ్వాల్సిందే, లేకపోతే దాన్ని కూడా పార్టీ అంటారా అని పెదవి విరుస్తారు. తాగని వారికి, మహిళలకు, పిల్లకాయలకు వారి ఇష్టాన్ని బట్టి థంప్సప్పో, స్ర్పైటో తెస్తారు సాధారణంగా. మందు తాగేవారందరికీ హార్డ్​ (బ్రాందీ, విస్కీ, రమ్​, వొడ్కా) అలవాటు ఉండకపోవచ్చు కానీ, బీరు అలవాటు మాత్రం ఉంటుంది. ఎందుకంటే మందు తాగడంలో ఓనమాలు దిద్దేది బీరుతోనే. కాబట్టి వచ్చిన గెస్టుల సంఖ్యను బట్టి 1 కేసులు, రెండు కేసుల బీర్లు తేవాల్సిందే. ఒక కాటన్​లో 12 బీర్లు ఉంటాయి.

'మద్యపానం హానికరం' అని ప్రభుత్వం ప్రకటనలిస్తున్నప్పటికీ తాగే వారు తాగడం మానట్లేదు. యువతకు బీర్లపైన ఉన్న మోజు అంతా ఇంతా కాదు. ద్రవ చైతన్య సదస్సులో కాలేజీలో జరిగే సమకాలీన అంశాలపై చర్చలెన్నో లేవనెత్తుతారు. వాటిల్లో ఎన్నో బిల్లులకు ఆమోదముద్ర కూడా వేస్తారు.

మందు అనేది వినోదానికి, ఆహ్లాదానికి మాత్రమే.. శృతి మించితే ఏదైనా చేదే...బీరు చేదెక్కక ముందే జాగ్రత్తపడండి..
(మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

Last Updated : Aug 2, 2019, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details