తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా నుంచి ఆయుధ కొనుగోళ్లను భారీగా పెంచిన భారత్​ - అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు

పొరుగు దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న క్రమంలో అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవటంపై దృష్టి సారించింది భారత్​. అందుకు అమెరికా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. అగ్రరాజ్యం నుంచి ఆయుధాల కొనుగోళ్లు 2019లో 6.2 మిలియన్​ డాలర్లు మాత్రమే ఉండగా.. 2020లో ఏకంగా 3.4 బిలియన్​ డాలర్లకు చేరుకున్నాయి.

India's weapons procurement
ఆయుధాల కొనుగోలు

By

Published : Dec 9, 2020, 8:59 AM IST

అమెరికా నుంచి భారత్​ ఆయుధాల కొనుగోలు 2020లో భారీగా పెరిగింది. 2019లో 6.2 మిలియన్​ డాలర్లు మాత్రమే ఉండగా.. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పదవీకాల చివరి ఏడాది ఏకంగా 3.4 బిలియన్​ డాలర్లకు చేరుకున్నాయి. అయితే.. విదేశాలకు అమెరికా ఆయుధాల అమ్మకాల్లో భారీగా తగ్గుదల నమోదైన సమయంలో భారత్​కు ఎగుమతులు భారీగా పెరగటం గమనార్హం. రక్షణ భద్రతా సహకార సంస్థ (డీఎస్​సీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. విదేశాలకు 2020లో అగ్రరాజ్య ఆయుధ ఎగుమతులు 2019 (55.7 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే 50.8 బిలియన్​ డాలర్లకు పడిపోయాయి. అది 2017లో 41.9 బిలియన్​ డాలర్లుగా ఉంది.

70 ఏళ్లలో 12.8 బిలియన్​ డాలర్లు

2020 ఎడిషన్​ విక్రయాల పుస్తకం ప్రకారం.. అమెరికా నుంచి భారత్​​ ఆయుధాల కొనుగోలు 2017లో 754.4 మిలియన్​ డాలర్లు, 2018లో 282 మిలియన్​ డాలర్లుగా ఉంది. 1950-2020 మధ్య కాలంలో భారత్​.. విదేశీ మిలిటరీ సేల్స్​(ఎఫ్​ఎంఎస్​)లో భాగంగా అమెరికా నుంచి 12.8 బిలియన్​ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేసింది.

2020లో అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన ప్రధాన దేశాల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశం

2020లో

(బిలియన్​ డాలర్లలో)

2019లో

(మిలియన్​ డాలర్లలో)

భారత్ 3.4 6.2 మొరాకో 4.5 12.4 పోలండ్ 4.7 673 సింగపూర్ 1.3 137 తైవాన్ 11.8 876 యూఏఈ 3.6 1.1 బిలియన్​ డాలర్లు

మరోవైపు పలు దేశాలు అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలును గణనీయంగా తగ్గించాయి. అందులో సౌదీ అరేబియా 2019లో 14.9 బిలియన్​ డాలర్లు ఉండగా 2020లో 1.2 బిలియన్​ డాలర్లకు తగ్గించింది. అఫ్గానిస్థాన్ దిగుమతులు​ 2019లో 1.6 బిలియన్​ డాలర్లు కాగా.. 2020లో 1.1 బిలియన్​ డాలర్లకు క్షీణించాయి. బెల్జియం 2019లో 5.5 బిలియన్​ డాలర్ల నుంచి 2020లో 41.8 మిలియన్లకు, ఇరాక్​ 1.4 బిలియన్​ డాలర్ల నుంచి 368 మిలియన్లకు, దక్షిణ కొరియా 2.7 బిలియన్​ డాలర్ల నుంచి 2.1 బిలియన్​ డాలర్లకు తగ్గించింది.

పాకిస్థాన్​కు ఎలాంటి మిలిటరీ, భద్రతా సహకారం అందించకూడదని ట్రంప్​ పరిపాలన విభాగం చెబుతున్నప్పటికీ.. తాజా గణాంకాల ప్రకారం పాక్​కు ఆయుధాల విక్రయాలు జరిగాయి. 2020లో 146 మిలియన్​ డాలర్ల విలువైన ఆయుధాలను పాకిస్థాన్​కు అందించింది అమెరికా.

ఇదీ చూడండి: సాంకేతిక పరిజ్ఞానంతో మారుతున్న 'యుద్ధతంత్రం'

ABOUT THE AUTHOR

...view details