తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా-తాలిబన్ల​ శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన భారత్​

అఫ్గానిస్థాన్​లో శాంతి స్థాపన కోసం అమెరికా, తాలిబన్​ల మధ్య జరిగిన చరిత్రాత్మక ఒప్పందాన్ని భారత్​ స్వాగతించింది. అఫ్గానిస్థాన్​లో హింసను అంతం చేసి, శాంతి, స్థిరత్వం నెలకొనడానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది.

MEA on US-Taliban peace deal
యూఎస్-తాలిబన్​ శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన భారత్​

By

Published : Feb 29, 2020, 9:34 PM IST

Updated : Mar 3, 2020, 12:10 AM IST

అఫ్గానిస్థాన్‌లో సుస్థిర శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో అమెరికా, తాలిబన్‌ల మధ్య కుదిరిన చరిత్రాత్మక ఒప్పందంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. అఫ్గానిస్థాన్​లో హింసను అంతం చేసి శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు అన్ని విధాల మద్దతుగా నిలవడమే తమ విధానమని స్పష్టం చేసింది. పొరుగువారిగా... అఫ్గానిస్థాన్​ సంపన్న భవిష్యత్​ కోసం, అక్కడి ప్రజల ఆకాంక్షల సాకారం కోసం తోడ్పడతామని భారత్ పేర్కొంది.

శాంతిస్థాపనకు నాంది

దశాబ్దాలుగా యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్థాన్​లో సుస్థిర శాంతిని నెలకొల్పేందుకు అమెరికా-తాలిబన్ల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాలో యూఎస్​-తాలిబన్ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనితో అఫ్గానిస్థాన్​ నుంచి 14 నెలల్లోపు మొత్తం బలగాలను అమెరికా, దాని మిత్రదేశాలు ఉపసంహరించుకోనున్నాయి.

ఇదీ చూడండి:యుద్ధభూమిలో శాంతిస్థాపనే ధ్యేయంగా చారిత్రక ఒప్పందం

Last Updated : Mar 3, 2020, 12:10 AM IST

ABOUT THE AUTHOR

...view details