తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2020, 12:48 PM IST

ETV Bharat / international

'భారత్​ నాయకత్వంలో ఆ లక్ష్యాలు సాధ్యమే'

వాతావరణ మార్పులో ప్రపంచం తన లక్ష్యాలను సాధించగలదనే నమ్మకం కలుగుతుందని ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్​ అమీనా మొహమ్మద్ పేర్కొన్నారు. భారత్​ నాయకత్వంలో సౌరశక్తి, పరిశ్రమ నిర్వహణలో వస్తున్న మార్పులే దీనికి నిదర్శమని అమీనా అన్నారు.

India's leadership on solar, industry transition reason to believe climate goals can be achieved: UN
'భారత్​ సౌర నాయకత్వంలో ఆ లక్ష్యాలు సాధ్యమే'

భారత్​ నాయకత్వంలో సౌరశక్తి, పరిశ్రమల నిర్వహణలో వస్తున్న మార్పులు చూస్తుంటే వాతావరణ కాలుష్య నివారణలో ప్రపంచం తన లక్ష్యాలను చేరుకోలదనే నమ్మకం కలుగుతుందని ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్​ అమీనా మొహమ్మద్​ అన్నారు. 'పీపుల్​ అండ్​ క్లైమేట్​- జస్ట్ ​ట్రాన్సిసన్​ ఇన్​ ప్రాక్టీస్​' వెబినార్​లో​ మాట్లాడిన అమీనా... ఈ వార్త ప్రపంచ వాతావరణ సమస్యలను అధిగమించడానికి ప్రొత్సాహాన్ని ఇస్తుందన్నారు. కరోనా తర్వాత అన్ని దేశాలు ఆర్థికవృద్ధిపై దృష్టిసారించాయని అమీనా అన్నారు. అయితే స్థిరమైన వృద్ధితో పాటు అధిక ఉద్యోగాలు కల్పించేలా అభివృద్ధి ఉండాలని ఆయన పేర్కొన్నారు.

"జపాన్, కొరియా సహా 110 దేశాలు.. 2050 నాటికి కర్బన ఉద్గారాలను నియంత్రిస్తామని ప్రతిజ్ఞ చేశాయి. చైనా కూడా 2060కి ముందే తమ లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపింది. సౌరశక్తి, పరిశ్రమల పరివర్తన, వాటి అభివృద్ధికి భారత్​ నాయకత్వం, చొరవ ఆధారంగా వాతావరణ కాలుష్య నివారణలో లక్ష్యాలను ప్రపంచం చేరకోగలదనే విశ్వాసం కలుగుతోంది. ఇది అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది."

- అమీనా మొహమ్మద్​, ఐరాస డిప్యూటీ సెక్రటరీ జనరల్​

"వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక వృద్ధి మందగిస్తుందనే భావన తప్పని నిరూపితం అయింది. శిలాజఇంధనాలకు బదులు పునరుత్పాదక వనరలుపై పెట్టుబడులు పెట్టినట్లయితే మూడు రెట్లు ఉద్యోగులు సృష్టించవచ్చు" అని అమీనా అన్నారు.

వాతావరణ కాలుష్య నివారణలో భాగంగా పునరుత్పాదక వనరుల వినియోగాన్ని ప్రోత్సాహించే చర్యలకు ఉపక్రమించింది భారత్. ​సౌరవిద్యుత్​ వినియోగానికి, పరిశ్రమల నిర్వహణలో మార్పులకు భారత్​ పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది.

ఇదీ చూడండి:తీవ్ర పేదరికంలోకి 20 కోట్ల మంది: ఐరాస

ABOUT THE AUTHOR

...view details