భారత్‌లో ఉత్పరివర్తనం చెందిన కరోనా బీ.1.617 వైరస్ రకం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పటివరకు కనీసం 17 దేశాల్లో ఈ కరోనా వైరస్ రకాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ జంట ఉత్పరివర్తనాల వైరస్ రకం తొలిసారిగా భారత్‌లో బయటపడగా యూకే, సింగపూర్ సహా పలు దేశాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఇది ప్రాణాంతకమని ప్రకటించలేమని పేర్కొంది. ఇతర రకాలతో పోలిస్తే ఈ రకం వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌వో వివరించింది.
భారత్‌లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడానికి బీ.1.617 రకానిదే కీలక పాత్ర అయి ఉంటుందని అంచనా వేస్తోంది. ఆరోగ్య ప్రమాణాల పట్ల ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం, జన సమూహాలు, నిబంధనలు పట్టించుకోకపోవడం వల్ల కేసులు అమాంతం పెరిగాయని తెలిపింది.భారత్‌లో వెలుగుచూసిన వైరస్ కొత్తరకం ప్రాణాంతకం అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.