కరోనాపై పోరులో దక్షిణాసియా దేశాలకు అండగా నిలుస్తూ ఆయా దేశాలకు టీకాలను పంపిణీ చేస్తోన్న భారత్‌ను అమెరికా ప్రశంసించింది. భారత్ ఓ నిజమైన మిత్ర దేశమని జోబైడెన్ ప్రభుత్వం పేర్కొంది. మిలియన్ల కొద్దీ కరోనా టీకాలను ఉచితంగా సరఫరా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన ప్రపంచానికి భారత్ పాటుపడుతోందని అభినందించింది.
భారత్ ఓ నిజమైన మిత్ర దేశం: అమెరికా - వ్యాక్సిన్ తాజా వార్తలు
ఇరుగు పొరుగు దేశాలైన మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్‌కు భారత్ ఉచితంగా టీకాలను సరఫరా చేయడాన్ని అమెరికా స్వాగతించింది. భారత్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించింది. భారత్ నిజమైన మిత్రదేశమని పేర్కొంది.
భారత్ ఓ నిజమైన మిత్ర దేశం: అమెరికా
ఇరుగు పొరుగు దేశాలైన మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్‌కు భారత్ ఉచితంగా టీకాలను సరఫరా చేసింది. భారత్ నుంచి వచ్చిన టీకాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సరిహద్దు దేశాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కొవిడ్ మహమ్మారిపై జరుగుతన్న పోరాటంలో మానవాళిని కాపాడేందుకు టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటమే కాక వాటిని ఇతర దేశాలతో పంచుకోవడంపై ప్రపంచ దేశాల నుంచి భారత్ ప్రశంసలు అందుకుంటోంది.