ఎవరైనా ఉద్యోగం ఎన్నేళ్లు చేయగలరు? మహా అయితే 20-30 ఏళ్లు. కానీ... అమెరికా ఇండియానా రాష్ట్రం క్లింటన్‌కు చెందిన బాబ్ వోల్మర్ మాత్రం 6 దశాబ్దాలుకుపైగా పనిచేశారు. 102 ఏళ్ల వయస్సులో గురువారం ఉద్యోగ విరమణ చేశారు.
బాబ్ వోల్మర్... 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికుడు. 1962లో ఇండియానా రాష్ట్ర సహజ వనరుల విభాగంలో సర్వేయర్‌గా చేరారు. ఆ శాఖ పరిధిలోని ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక డేటా సేకరించడం, సరిహద్దులు నిర్ణయించడం ఆయన విధి. గురువారం చివరిసారిగా ఓ ప్రాజెక్టుకు సర్వే చేశారు. శరీరం ఇక సహకరించదని గుర్తించే పదవీ విరమణ చేస్తున్నట్లు చెప్పారు బాబ్.