తొలిసారి న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 74వ స్వాతంత్య్ర వేడుకలు ఈ చారిత్రక కూడలిలో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల జెండాను న్యూయ్కార్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైస్వాల్ ఎగరేశారు. సంప్రదాయ దుస్తులతో ఈ వేడుకకు హాజరైన భారతీయులు భారత్, అమెరికా జాతీయ పతాకాలతో పాల్గొన్నారు. ఇరు దేశాల జెండాలను ఊపుతూ భారత్ మాతా కీ జై, వందేమాతరం 'జై హింద్' అంటూ నినాదాలు చేశారు.
టైమ్స్ స్క్వేర్‌లో తొలిసారి ఎగిరిన మువ్వన్నెల జెండా - Independence Day
భారత 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమెరికా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన ప్రజలు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.
టైమ్స్ స్క్వేర్‌లో తొలిసారి ఎగిరిన మువ్వన్నెల జెండా
ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని ప్రముఖ అంబరిల్లా డయాస్పోరా సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ సంయుక్తంగా నిర్వహించాయి.
Last Updated : Aug 16, 2020, 9:49 AM IST