ప్రతిభావంతులైన భారతీయ యువత అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతోందని ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్1బీ వీసా విధానంపై అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరే అందుకు కారణమని చట్టసభ్యులకు తెలిపారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు, శాశ్వత నివాస హోదా జారీకి దేశాల వారీగా కేటాయింపులు చేయడం.. భారతీయ యువత కెనడాకు తరలివెళ్లడానికి దారితీస్తోందన్నారు.
'అమెరికా విధానాలతో కెనడాకు భారత యువత' - భారతీయ అమెరికన్ల వార్తలు
కాలం చెల్లిన వీసా విధానాల వల్ల ప్రతిభావంతులైన భారతీయ యువత అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతోందని అగ్రరాజ్య కాంగ్రెస్‌ను హెచ్చరించారు నిపుణులు. భారతీయ ప్రతిభ అమెరికా నుంచి కెనడా వైపు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని చట్టసభ్యులను కోరారు.
మూడు ఉద్యోగ ఆధారిత విభాగాల బ్యాక్‌లాగుల్లో భారతీయుల వాటా ప్రస్తుతం 9.15 లక్షలుగా ఉందన్న అధికారులు.. ఈ సంఖ్య 2030 నాటికి 21.95 లక్షలకు చేరుతుందని అంచనావేశారు. సుమారు 20 లక్షల మంది దశాబ్దం పాటు ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు కోసం వేచిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు వలసలు, పౌరసత్వానికి సంబంధించి హౌస్ జ్యుడిషియరీ కమిటీ ముందు అధికారులు తమ వాదనలు వినిపించారు. భారతీయ ప్రతిభ అమెరికా నుంచి కెనడా వైపు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను కోరారు.
ఇదీ చదవండి :George W.Bush: బలగాల ఉపసంహరణ తప్పిదమే!