అఫ్గానిస్థాన్‌లో ఇటీవల తాలిబన్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిశ్ సిద్దీఖి మృతి... అకస్మాత్తుగా యాదృచ్ఛికంగా జరిగింది కాదని అమెరికా మేగజీన్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' పేర్కొంది. దీనిపై గురువారం ప్రత్యేక కథనం ప్రచురించింది. "సిద్దీఖి.. పాకిస్థాన్ సరిహద్దులోని బోల్డక్ ప్రాంతంలో అఫ్గాన్- తాలిబన్ల పోరాటాన్ని కవర్ చేసేందుకు అఫ్గాన్ ఆర్మీ బృందంతో కలిసి వెళ్లారు. బోల్డక్ చెక్‌పోస్టు వద్ద ఈ బృందంపై తాలిబన్లు దాడి చేయడం వల్ల అంతా చెల్లాచెదురయ్యారు. సిద్దీఖి, మరో ముగ్గురు అఫ్గాన్ సైనికులు వేరుపడ్డారు. దాడిలో పదునైన ఆయుధం సిద్దీఖిని తాకింది. అతన్ని సమీపంలోని మసీదులోకి తీసుకెళ్లిన సైనికులు అక్కడే ప్రాథమిక వైద్యం చేయించారు" అని కథనంలో చెప్పింది.
అతనెవరో తెలిశాక..