భారత సంతతికి చెందిన వారికి కెనడా ప్రభుత్వం మరోసారి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈసారి ఓ మహిళకు ఆ అవకాశం దక్కింది. భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ముఖ్య బాధ్యతలను నిర్వహించనున్నారు. మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. ఆమెను నూతన రక్షణ మంత్రిగా మంగళవారం నియమించారు.
కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ - కెనడా రక్షణ మంత్రి భారత సంతతి
కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌కు కీలక పదవి దక్కింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అనితను నూతన రక్షణ మంత్రిగా నియమించింది అక్కడి ప్రభుత్వం.
కెనడా రక్షణ మంత్రిగా అనితా ఆనంద్
54 ఏళ్ల అనితా ఆనంద్.. కెనడా రక్షణ మంత్రిగా ఉన్న భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదీ చూడండి :ఒక్కసారిగా పెట్రోల్ బంకులన్నీ బంద్- సైబర్ దాడే కారణం!