అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ తెలుగు ఎన్ఆర్ఐకి 56 నెలల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. మాజీ భార్యను కిడ్నాప్ చేయటం, తీవ్రంగా గాయపరచటం, సాక్ష్యాలు తారు మారు చేయటం వంటి కేసుల్లో దోషిగా తేల్చింది. శిక్షాకాలం పూర్తయినప్పటికీ మరో మూడేళ్ల పాటు పెరోల్లో ఉండాలని ఆదేశించింది.
ఇదీ జరిగింది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019, ఆగస్టు 6న తెలుగువాడైన ఆకుల సునీల్ మసాచుసెట్స్‌లోని అగావామ్కు వెళ్లాడు. తన మాజీ భార్య ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తనతో రావాలని గొడవకు దిగాడు. టెక్సాస్ తీసుకెళ్తానని చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవటం వల్ల బలవంతంగా కారులో ఎక్కుంచుకొని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. పలు ప్రాంతాలు తిప్పుతూ కారులోనే దాడి చేశాడు. తాను పని చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశాడు, ల్యాప్‌టాప్ పగలగొట్టి రోడ్డు పక్కన పడేశాడు. టెన్నెస్సిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి మళ్లీ దాడికి పాల్పడ్డాడు. తెల్లవారి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నక్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్ట్‌తో భారత్‌కు తిరిగి రావాలనే సునీల్ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లయింది. తన భార్య తండ్రితో మాట్లాడి కేసు వాపసు తీసుకునేలా చేయాలని కుటుంబ సభ్యులను కోరినట్లు సమాచారం.
ఇదీ చూడండి:తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని గొంతుకోసుకున్నాడు!