తెలంగాణ

telangana

ETV Bharat / international

3 నెలలు ఎయిర్​పోర్ట్​లోనే నివాసం.. నిర్దోషిగా బయటకు...

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన షికాగో ఎయిర్​పోర్ట్​లోనే ఓ వ్యక్తి 3 నెలలు నివాసం ఉన్నాడు. అదీ అధికారుల కళ్లు గప్పి. ఆ తర్వాత నిజం బయటపడింది. అధికారులు ఈ జనవరిలో అతడ్ని అరెస్టు చేశారు. ఇప్పుడు కోర్టు ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. అసలేం జరిగింది? ఎయిర్​పోర్ట్​లో 3 నెలలు ఎందుకున్నాడు?

Chicago's O'Hare International Airport
3 నెలలు ఎయిర్​పోర్ట్​లోనే నివాసం

By

Published : Oct 28, 2021, 12:59 PM IST

అధికారుల కళ్లు గప్పి 3 నెలలు ఎయిర్​పోర్ట్​లో తలదాచుకున్న భారత సంతతి వ్యక్తిని అమెరికా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతడు ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదని స్పష్టం చేశారు కుక్​ కౌంటీ జడ్జి ఆడ్రియెన్​ డేవిస్​.

అసలేం జరిగిందంటే..

37 ఏళ్ల ఆదిత్య సింగ్​ భారత సంతతి వ్యక్తి. మాస్టర్స్​ డిగ్రీ కోర్సు చేసేందుకు.. అమెరికాకు ఆరేళ్ల క్రితం వెళ్లారు. లాస్​ ఏంజెలెస్​లో నివాసం ఉన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో.. 2020 అక్టోబర్​ 19న భారత్​ వెళ్లాలని నిశ్చయించుకొని షికాగోలోని ఓ'హేర్​ విమానాశ్రయానికి బయల్దేరారు. కానీ.. కరోనా భయంతో ఎటూ వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు.

సెక్యూరిటీ కెమెరాలకు చిక్కకుండా అక్కడి సెక్యూర్డ్​ ఏరియాలోనే 3 నెలలు అనధికారికంగా నివసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుర్తింపు కార్డును చూపించమని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అడిగినప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో అతడ్ని జనవరి 16న అరెస్టు చేశారు. గుర్తింపు అడిగిన సిబ్బందికి తన దగ్గరున్న బ్యాడ్జ్ చూపించారు. అయితే ఆ బ్యాడ్జ్ ఎయిర్​పోర్ట్ ఆపరేషన్స్ మేనేజర్‌ది. అది పోయినట్టుగా అక్టోబర్​లోనే సదరు మేనేజర్ ఫిర్యాదు చేశారు.

విమానాశ్రయ నిషేధిత ప్రాంతంలో అక్రమ చొరబాటు సహా విమానాశ్రయంలో దొంగతనం చేసినట్లుగా సింగ్​పై అభియోగాలు మోపారు. వెంటనే దీనిపై దర్యాప్తునకు ఉపక్రమించింది ఎయిర్​పోర్ట్​ భద్రతా విభాగం. అయితే సింగ్​ నిషేధిత ప్రాంతంలో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు కనుగొనలేకపోయారు. విమానాశ్రయ నిబంధనలు కూడా ఉల్లంఘించలేదని తేలింది.

ఇప్పుడు కోర్టు కూడా అతడిని నిర్దోషిగా ప్రకటించింది.

ఇవీ చూడండి: Third wave: పొంచి ఉన్న మూడో దశ.. కొన్ని దేశాల్లో పెరుగుతున్న కేసులు

గూగుల్​, మైక్రోసాఫ్ట్​కు లాభాల పంట- అంతా కరోనా మాయ!

ABOUT THE AUTHOR

...view details