వయాగ్రా మాత్రలను అక్రమంగా తరలిస్తున్న ఓ భారతీయుడిని అమెరికాలోని చికాగో విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 3,200 మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.
స్కాన్ చేయగా..
వయాగ్రా మాత్రలను అక్రమంగా తరలిస్తున్న ఓ భారతీయుడిని అమెరికాలోని చికాగో విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 3,200 మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.
స్కాన్ చేయగా..
భారత్ నుంచి అమెరికాకు తిరిగి వెళ్లిన సదరు వ్యక్తి బ్యాగును స్కాన్ చేయగా.. ఈ మాత్రల విషయం బయటపడినట్లు అమెరికా కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇంతటి ఎక్కువ పరిమాణంలో మాత్రలను తీసుకువెళ్లడంపై సరైన సమాధానం ఇవ్వకపోవడం వల్ల అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న మాత్రల ధర 96,608 డాలర్లుగా(దాదాపు రూ.70 లక్షల) ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
అమెరికా వెలుపల కొనుగోలు చేసిన మందులను దిగుమతి చేసుకునేందుకు అక్కడి ఆహార ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించదని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి అమెరికాకు కొంతమంది ప్రమాదకరమైన వస్తువులను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చికాగో విమానాశ్రయం డైరెక్టర్ షేన్ క్యాంప్‌బెల్ అన్నారు. వీటిని కట్టడి చేసేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:అమెరికాలో కాల్పులు- ఇద్దరు చిన్నారులు మృతి