ఐక్యరాజ్యసమితిలో భారత్ మరో విజయం సాధించింది. ఐరాస పాలన, బడ్జెట్ సలహా కమిటీ(ఏసీఏబీక్యూ)కి భారత దౌత్యవేత్త విదిశా మైత్రా ఎన్నికయ్యారు. ఈ కమిటీ ఐరాస జనరల్ అసెంబ్లీకి అనుబంధంగా పనిచేస్తుంది. విస్తృత భౌగోళిక ప్రాతినిధ్యం, వ్యక్తిగత అర్హత, అనుభవం ఆధారంగా సలహా కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారు.
2021 జనవరి 1 నుంచి మైత్రా పదవీకాలం ప్రారంభమవుతుంది. మూడేళ్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. 2021 జనవరి నుంచి రెండేళ్ల కాలానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగనున్న నేపథ్యంలో ఈ విజయం వరించటం విశేషం.