అక్రమంగా నివాసం ఉంటూ అరెస్టయిన ముగ్గురు భారతీయుల నిరాహార దీక్షను అమెరికా అధికారులు భగ్నం చేశారు. వీసా గడువు తీరి, అక్రమంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్నారన్న కేసులను పునర్విచారణ చేయాలని కోరుతూ వీరు నిరశనకు దిగారు. వీరిలో ఒకరు ఏడాదికిపైగా శిక్ష అనుభవిస్తున్నారని సమాచారం.
అమెరికా ఆశ్రయం కోసం 28 రోజులుగా ఈ ఖైదీలు టెక్సాస్లోని ఎల్ పాసోలో నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ అమెరికా అధికారులు ఇన్ని రోజులు పట్టించుకోలేదు. చివరకు దీక్షను భగ్నం చేసి, సెలైన్ అందించారు. అయినా నిరశన కొనసాగిస్తే బలవంతంగా ఆహారం తినిపించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు.