తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్​.. కశ్మీర్​ అంశంలో భారత్​కు మద్దతివ్వండి' - భారత్

కశ్మీర్​ అంశంలో భారత్​కు పూర్తి మద్దతుగా నిలవాలని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను కోరారు భారతీయ అమెరికన్లు. పాక్​ ప్రోద్బలంతో ఎదిగిన సరిహద్దు తీవ్రవాదానికి చరమగీతం పాడేలా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.

ట్రంప్

By

Published : Aug 6, 2019, 2:26 PM IST

పాక్​ ప్రోత్సహిస్తున్న సరిహద్దు తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు కశ్మీర్​ ప్రత్యేక హోదా రద్దుకు భారత్​ నిర్ణయం తీసుకుందని అమెరికాలోని భారతీయులు పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్​కు పూర్తి మద్దతుగా నిలవాలని ట్రంప్​ సర్కారును కోరారు.

"కశ్మీర్​పై భారత సార్వభౌమాధికారంతో తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని అమెరికాను మేం కోరుతున్నాం. సరిహద్దుల్లో పాక్​ ప్రోత్సహిస్తున్న తీవ్రవాదానికి చరమగీతం పాడేలా ఆ దేశంపై ఒత్తిడిని అమెరికా పెంచాలి. అప్పుడే కశ్మీర్​ సమస్య పరిష్కారం అవుతుంది."

-సమీర్​ కాలరా, హిందూ అమెరికన్ ఫౌండేషన్​ ఎండీ

ఓవర్సీస్​ ఫ్రెండ్స్​ ఆఫ్​ బీజేపీ(ఓఎఫ్​బీజేపీ), అమెరికా ప్రపంచ హిందూ మండలి​, యూఎస్​లోని కశ్మీరీ పండిత్​ సమాజం, ఇండో యూరోపియన్​ కశ్మీర్​ ఫోరం, ఇండో కెనడియన్​ కశ్మీర్​ ఫోరం లాంటి సంస్థలు మోదీ ప్రభుత్వ​ నిర్ణయాన్ని స్వాగతించాయి.

"సుదీర్ఘ కాలంలో పెండింగ్​లో ఉన్న ఆర్టికల్ 370 రద్దుపై మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, నెహ్రూ ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దడం చారిత్రకం. ఈ చర్యపై సంతోషం వ్యక్తంచేస్తూ రానున్న రెండు వారాల్లో వేడుకలు నిర్వహించేందుకు ప్రవాస భారతీయ సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి."

-కృష్ణా రెడ్డి, ఓవర్సీస్​ ఫ్రెండ్స్​ ఆఫ్​ బీజేపీ అధ్యక్షుడు

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: షా

ABOUT THE AUTHOR

...view details