అమెరికా ప్రగతి గాథలో భారతీయ-అమెరికన్లు కీలకంగా మారారని అన్నారు అధ్యక్షుడు జో బైడెన్. తన ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో అనేక మంది భారతీయ అమెరికన్లు ఉండడాన్ని ఉద్దేశించి ఈమేరకు వ్యాఖ్యానించారు.
నాసా అంగారక గ్రహంపైకి ప్రయోగించిన ‘పర్సెవరెన్స్' రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిన నేపథ్యంలో శాస్త్రవేత్తల బృందంతో బైడెన్ వర్చువల్గా మాట్లాడారు. ఈ ప్రయోగ నావిగేషన్, నియంత్రణ కార్యకలాపాలకు భారత సంతతి శాస్త్రవేత్త స్వాతి మోహన్ నాయకత్వం వహించారు. ఆమెతోపాటు ఇతర భారతీయ అమెరికన్లపై ప్రశంసల జల్లు కురిపించారు బైడెన్.
''భారత-సంతతి అమెరికన్లు దేశంలో కీలకంగా మారుతున్నారు. స్వాతి మోహన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, నా స్పీచ్ రైటర్ వినయ్ రెడ్డి వంటి వారే ఇందుకు నిదర్శనం.''