తెలంగాణ

telangana

ETV Bharat / international

భారతీయ అమెరికన్ల వార్షికాదాయం ఎంతంటే... - సంపాదనలో భారతీయ అమెరికన్లు

కుటుంబ సగటు ఆదాయంలో భారతీయ అమెరికన్లు సత్తా చాటారు. శ్వేతజాతి అమెరికన్లకన్నా అధికంగా... ఏడాదికి దాదాపు రూ.87 లక్షలు ఆర్జిస్తున్నారు.

Indian Americans household income average
భారతీయ అమెరికన్ల ఏడాది సంపద ఎంతో తెలుసా?

By

Published : Jan 29, 2021, 3:14 PM IST

అమెరికాలోని ప్రవాస భారతీయ కుటుంబాల సగటు ఆదాయం ఏడాదికి దాదాపు రూ.87 లక్షలుగా ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. శ్వేతజాతి అమెరికన్లు సహా ఇతర వర్గాల వారి ఆదాయం కన్నా ఇది చాలా ఎక్కువని తేలింది.

ఆసియా పసిఫిక్ అమెరికన్​ కమ్యూనిటీ అభివృద్ధి సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం... భారతీయ అమెరికన్ల సంపాదన అత్యధికంగా 1,19,858 డాలర్లుగా ఉంది. మయన్మార్ నుంచి వచ్చిన​ కుటుంబాల సగటు ఆదాయం 45,348 డాలర్లు కాగా, లాటిన్​ అమెరికా కుటుంబాల సంపాదన 51,404 డాలర్లుగా ఉన్నాయి. నల్లజాతీయుల కుటుంబ సగటు ఆదాయం అతి తక్కువగా 41, 511 డాలర్లు మాత్రమే ఉంది.

దారిద్య్రం, సొంత ఇళ్లు, ఇంటి అద్దె ఒత్తిడి మొదలైన అంశాల్లో మాత్రం ఆసియా అమెరికన్​, పసిఫిక్​ దేశాల వారు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నారని నివేదికలో వెల్లడైంది. ఆసియన్ల కనీస ఆదాయ సగటు... నల్లజాతీయులు, లాటిన్​ అమెరికన్​ వారి కంటే రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది.

ఇదీ చదవండి:'భారత్​-పాక్​ల మధ్య యుద్ధం ప్రపంచానికే పెను ముప్పు'

ABOUT THE AUTHOR

...view details