తెలంగాణ

telangana

ETV Bharat / international

టార్గెట్​ చైనా: విదేశాల్లో ఆగని నిరసనలు

చైనా విస్తరణవాద దురాక్రమణలకు వ్యతిరేకంగా పలు దేశాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికా, కెనడాలోని చైనా రాయబార కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు ప్రవాస భారతీయులు, పలు దేశాల పౌరులు.

Indian-Americans hold protest
విదేశాల్లో కొనసాగుతోన్న చైనా వ్యతిరేక నిరసనలు

By

Published : Jul 20, 2020, 11:38 AM IST

భారత్​-చైనాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. డ్రాగన్​కు వ్యతిరేకంగా పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చైనా విస్తరణవాదాన్ని ఖండిస్తూ.. అమెరికా, కెనడాలో ఆందోళనలు చేపట్టారు అక్కడి ప్రవాస భారతీయులు సహా పలు దేశాల పౌరులు.

అమెరికాలో..

అమెరికా వాషింగ్టన్​ డీసీలోని చైనా ఎంబసీ ఎదుట నిరసనలు చేశారు భారతీయ అమెరికన్లు. ప్లకార్డులు, జెండాలు చేతబూని.. చైనా వ్యతిరేక నినాదాలు చేశారు. చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్​ అమెరికన్ల ప్రాణాలను హరిస్తోందని ప్లకార్డులు ప్రదర్శించారు.

అమెరికాలో చైనా వ్యతిరేక నిరసనలు
అమెరికాలో చైనా వ్యతిరేక నిరసనలు
అమెరికాలో చైనా వ్యతిరేక నిరసనలు
అమెరికాలో చైనా వ్యతిరేక నిరసనలు

కెనడాలో..

కెనడాలోని చైనా రాయబార కార్యాలయం ఎదుట కమ్యూనిస్ట్​ పార్టీకి వ్యతిరేకంగా.. టొరంటో, ప్రవాస ఇరానీలు, టిబెటన్​, వియత్నాం దేశాలకు చెందిన సభ్యులు, ప్రవాస భారతీయులు శనివారం ఆందోళన చేపట్టారు. భారత జెండాలను పట్టుకుని పదుల సంఖ్యలో నిరసనల్లో పాల్గొన్నారు.

కెనడాలో చైనా వ్యతిరేక నిరసనలు
కెనడాలో చైనా వ్యతిరేక నిరసనలు
కెనడాలో చైనా వ్యతిరేక నిరసనలు
కెనడాలో చైనా వ్యతిరేక నిరసనలు

ఇదీ చూడండి: పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో చైనా వ్యతిరేక నిరసనలు

ABOUT THE AUTHOR

...view details