అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి కమలా హారిస్ తప్పుకున్న కొద్ది గంటలకే మరో భారతీయ అమెరికన్ పీటర్ మాథ్యూస్... ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.
అగ్రరాజ్యంలోని దిగువ సభలో 47వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి అధ్యక్ష రేసులో దిగుతున్నట్టు తెలిపారు.
"స్వార్థ, దూరదృష్టిలేని రాజకీయాల నుంచి మనం దూరంగా జరగాలి. పరిశ్రమలకు సంబంధించిన నిబంధనలు సడలించడం, ధనికులు చెల్లించే పన్ను శాతంలో కోత విధించడం వల్ల దేశ ప్రజలు, పర్యావరణం నాశనమవుతోంది. ఈ విధానాన్ని మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ మొదలుపెడితే.. ట్రంప్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు."
--- పీటర్ మాథ్యుస్
భారత్లో జన్మించిన పీటర్.. 10ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులతో అమెరికాకు వెళ్లారు. ఆయన తండ్రి కేరళ, తల్లి తమిళనాడుకు చెందినవారు. అగ్రరాజ్యానికి చెందిన అనేక వార్తా ఛానెళ్లలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా గుర్తింపు పొందారు పీటర్.
ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్ష రేసు నుంచి కమలా హారిస్ వెనక్కి