అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కేబినెట్లో కీలక పదవికి నామినేషన్ దాఖలు చేసి ఆ తర్వాత ఉపసంహరించుకున్న భారతీయ అమెరికన్ నీరా టాండన్.. తాజాగా శ్వేతసౌధం సీనియర్ సలహాదారుగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది.
సీనియర్ సలహాదారుగా బాధ్యతలు చేపట్టగానే యూఎస్ డిజిటల్ సర్వీస్పై సమీక్ష నిర్వహించడం సహా దేశంలోని 'అఫోర్డబుల్ కేర్ యాక్ట్' సవరణకు సంబంధించి టాండన్ కృషి చేయనున్నట్లు తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో రూపొందించిన ఈ చట్టం రూపకల్పన, అమలులో నీరా కీలక పాత్ర పోషించారు.