అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. సమచార వ్యవస్థను నియంత్రించే స్వతంత్ర వ్యవస్థ దేశ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)లో సాంకేతిక విభాగం అధిపతిగా డా.మోనీష ఘోష్ నియామకమయ్యారు. ఎఫ్‌సీసీ సాంకేతిక విభాగంలో తొలి మహిళా చీఫ్ రికార్డ్ సృష్టించారు. ఎఫ్‌సీసీలో ఇండో-అమెరికన్ ఛైర్మన్ అజిత్ పాయ్‌తో పాటు సంస్థకు సాంకేతికత, ఇంజినీరింగ్ సమస్యల్లో సలహాలు అందించనున్నారు ఘోష్. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగానికి అనుబంధంగా పని చేయనున్నారు.
ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న డా.ఎరిక్ బర్గెర్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు మోనీష. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎఫ్‌సీసీ..