భారత సంతతికి చెందిన అమెరికా యువ వ్యాపారవేత్త మనీశ్ సేఠి ఐడియా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను తెగ ఇంప్రెస్ చేసింది(elon musk news). ఫేస్బుక్ కోసం రోజూ సగటున 6 గంటలు కేటాయించే మనీశ్.. ఆ అలవాటు మార్చుకునేందుకు వినూత్న ఆలోచన చేశారు. గంటకు 8 డాలర్లు చెల్లించి ఓ మహిళను నియమించుకున్నారు. ఇంతకీ ఆమె చేయాల్సిన పనేంటంటే.. మనీశ్ కంప్యూటర్లో ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా పడేల్‌మని ఓ చెంప దెబ్బకొట్టాలి(facebook slap).
మహిళను నియమించుకునేందుకు 2012లో అమెరికా అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి మనీశ్ ఓ యాడ్ ఇచ్చారు. 'నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నాపై గట్టిగా అరవాలి, లేదా చెంపదెబ్బ కొట్టాలి' అని ప్రకటనలో చెప్పారు. ఇది జరిగి 9 ఏళ్ల తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దృష్టికి వచ్చింది(elon musk news latest). దీనిపై స్పందించిన ఆయన రెండు ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేశారు(elon musk facebook).
ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మహిళతో చెంపదెబ్బ- ఐడియాకు మస్క్ ఫిదా మస్క్ ట్వీట్‌పై(elon musk news today) మనీశ్ కూడా స్పందించారు. 'మస్క్ పెట్టిన ఈ రెండు ఫైర్ ఎమోజీలకు అర్థం ఏమిటి? సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లొద్దని చెప్పే ఓ పురాణ కథకు ఆంతర్యమా? బహుశా కాలమే సమాధానం చెబుతుంది' అని పేర్కొన్నారు.
చేతులకు ధరించే డివైజ్‌లను తయారు చేసే పావ్లోక్ బ్రాండ్ సంస్థకు మనీశ్ సేఠి యజమాని. అమెరికాలో యువవ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. 2012లో ఫేస్బుక్ వచ్చిన కొత్తలో ఆయన ఎక్కువ సమయాన్ని అందులోనే గడిపేవారు. దీంతో తన ఉత్పాదకత దెబ్బతింటుందని, ఎలాగైనా ఆ అలవాటు నుంచి బయటపడాలని వినూత్న ప్రకటన ఇచ్చి మహిళను నియమించుకున్నారు. ఓ దురలవాటు మానుకోవడం కోసం మహిళ చేతిలో ఎన్నిసార్లు చెంపదెబ్బలు తిన్నా(facebook slap) తప్పు కాదని అప్పుడు చెప్పారు. చివరకు మనీశ్ ప్లాన్ సత్ఫలితాన్నిచ్చింది. మహిళను నియమించుకున్నాక ఫేస్‌బుక్‌కు సమయం కేటాయించడం తగ్గిపోయింది. మనీశ్ చెంపదెబ్బ ప్రకటనకు 20 మంది నుంచి స్పందన రావడం గమనార్హం.
ఇదీ చదవండి:స్టాక్ మార్కెట్లోనూ ఈ హీరోయిన్స్ హిట్- ఒక్కరోజులో 10 రెట్లు లాభం!