అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై వచ్చిన రెండో అభిశంసన నుంచి గట్టెక్కేలా కనిపించటం లేదు. ఇప్పటికే సెనేట్‌లో అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో అభిశంసనకు పలువురు భారతీయ అమెరికన్ చట్టసభ్యులు మద్దతు పలికారు. జనవరి 6న హింస చెలరేగేలా తన మద్దతుదారులను ట్రంప్ ప్రేరేపించటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
" ట్రంప్ తన మద్దతుదారులను ప్రేరేపించటం వల్లే గత నెలలో మన క్యాపిటల్ భవనం, ప్రజాస్వామ్య సంస్థలపై దాడి జరిగింది. ఆ రోజు అమెరికా ప్రతినిధులు, సెనేటర్లు, సిబ్బంది తమ ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు తీశారు. ఆయనను దోషిగా తేల్చాల్సిన అవసరాన్ని అది స్పష్టం చేస్తోంది. సెనేట్‌లో మాజీ అధ్యక్షుడి అభిశంసన విచారణ సమయంలో.. జనవరి 6న జరిగిన హింసాత్మక ఘటనలు గుర్తుకొచ్చాయి. క్యాపిటల్‌పై దుండగులు దాడికి పాల్పడినప్పుడు.. నా సిబ్బందితో పాటు మా కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశాం. మా కార్యాలయం కిటికీకి 200 అడుగుల దూరంలోనే బాంబును కనుగొన్నారు. "