తెలంగాణ

telangana

ETV Bharat / international

'రోజుకు 10వేల మాస్కుల ఉత్పత్తి- 300 మందికి ఉపాధి ' - Indian American entrepreneur

అమెరికాలో కరోనా ప్రబలుతుండటం వల్ల మాస్కులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రోజుకు 10వేల మాస్కులతోపాటు వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించారు భారత సంతతికి చెందిన అంకుర పరిశ్రమ నిర్వాహకుడు గురిందర్ సింగ్.

Indian
మాస్కులు

By

Published : Apr 11, 2020, 10:27 AM IST

అమెరికాలో కరోనా విజృంభిస్తుండటం వల్ల ప్రతి ఒక్కరు మాస్కు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అగ్రరాజ్యంలో మాస్కులు కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు రోజుకు 10వేల మాస్క్‌లు, వారానికి 15వేల ముఖ కవచాలను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించారు భారత సంతతికి చెందిన అంకుర పరిశ్రమ నిర్వాహకుడు గురిందర్ సింగ్.

ఇండియానాకు చెందిన గురిందర్ సింగ్ తన 'క్లియానాక్సా' సంస్థ ద్వారా వాటిని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే మొదటి వెయ్యి మాస్కులను వైద్య సిబ్బందికి ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.

బయటకు వెళ్లేవారి వ్యక్తిగత రక్షణ కోసం వారానికి 1,000 గౌన్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు గురిందర్ సింగ్. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా 300 కుటుంబాలకు ఉపాధి కూడా లభిస్తోందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details