తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్​ జట్టులో మరో భారతీయ అమెరికన్ - నీరా టాండెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో భారతీయ అమెరికన్ స్థానం సంపాదించారు. వ్యవసాయ విభాగంలో సీనియర్ సలహాదారుగా బిదీషా భట్టాచార్యను సోమవారం నియమించారు. మరోవైపు ఆఫీస్​ ఆఫ్ మేనేజ్​మెంట్​ అండ్​ బడ్జెట్ డైరెక్టర్​గా నీరా టాండెన్​ నియామకం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని పలువురు సెనేటర్లు స్పష్టం చేశారు.

biden, america
బైడెన్​ బృందంలో మరో భారతీయ అమెరికన్

By

Published : Feb 23, 2021, 1:40 PM IST

బైడెన్​ బృందంలో మరో భారతీయ అమెరికన్​కు చోటు దక్కింది. వాతావరణం, విద్యుత్​ విభాగంలో నిపుణురాలు అయిన బిదీషా భట్టాచార్య వ్యవసాయ విభాగంలో సీనియర్​ సలహాదారుగా నియమితులయ్యారు.

ఇదివరకు సెనేటర్ అల్​ ఫ్రాంకన్​కు విద్యుత్​, వ్యవసాయ విభాగాల సీనియర్​ సలహాదారుగా నాలుగేళ్లు పనిచేశారు. భారత్​లోని గ్రామీణాభివృద్ధి కోసం అంకుర సంస్థలతో కలిసి సౌర శక్తి ప్రాజెక్టులు చేపట్టారు.

నీరా టాండెన్ నియామకం..

శ్వేతసౌధం ముఖ్యవ్యూహకర్తల్లో ఒకరిగా ఎంపికైన భారతీయ అమెరికన్​ నీరా టాండన్​ నియామకం ఆగమ్యగోచరంగా మారింది. అధ్యక్షుడు బైడెన్​ మద్దతు ఉన్నా.. ఆమె సెనేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆఫీస్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​ అండ్​ బడ్జెట్​ (ఓఎంబీ)కి డైరెక్టర్​ పదవి చేపట్టడంపై రిపబ్లికన్లు ​సహా సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో నీరా వ్యవహార శైలి సరిగా లేదని ముగ్గురు రిపబ్లికన్లు, ఓ డెమొక్రాట్ విమర్శించారు. ఆమె నియామకం ప్రక్రియ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా ట్వీట్లను తన ఖాతా నుంచి డిలీట్ చేశారని ఆరోపించారు. దీనిపై ఇదివరకే నీరా సెనేటర్లను క్షమాపణ కూడా కోరారు.

మద్దతు ఇవ్వండి..

టాండెన్​కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెషనల్ ఏషియన్​ పసిఫిక్ అమెరికన్ కాకస్​ (సీఏపీఏసీ) సెనేటర్లకు లేఖ రాసింది. ఆర్థిక, విదేశీ వ్యవహారాల్లో అనుభవజ్ఞురాలైన నీరాను నియమిస్తే.. అమెరికా అభివృద్ధి, సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details