తెలంగాణ

telangana

ETV Bharat / international

'అంగారక యాత్ర' వ్యోమగాముల్లో ఇండో-అమెరికన్​

నాసా భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాల కోసం శిక్షణ ఇచ్చిన వారిలో ఓ భారత సంతతి అమెరికన్​ చోటు దక్కించుకున్నారు. రాజా జాన్ వుర్పుటూరు చారి అనే ప్రవాస భారతీయుడు సహా మొత్తం 11 మంది రెండేళ్ల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నారు. చంద్ర, అంగారక యాత్రలకు ఈ సుశిక్షితులైన వ్యోమగాములను పంపించేందుకు యోచిస్తోంది నాసా

nasa
నాసా జాబిల్లి, అంగారక ప్రయోగాల్లో భారత సంతతి వ్యోమగామి!

By

Published : Jan 11, 2020, 4:32 PM IST

భవిష్యత్‌లో చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాల కోసం నాసా వ్యోమగాములను సిద్ధం చేసింది. రెండేళ్ల పాటు వ్యోమగామ శిక్షణ పూర్తి చేసుకున్న 11మందికి పట్టాలు అందించింది. వీరిలో రాజా జాన్‌ వూర్పుటూరు చారి అనే భారతీయ అమెరికన్‌ కూడా ఉన్నారు. ఈ 11మంది భవిష్యత్‌లో నాసా చేపట్టే ప్రతిష్ఠాత్మక జాబిల్లి, అంగారక యాత్రల్లో భాగం కానున్నారు.

41ఏళ్ల రాజాచారి.. అమెరికా వైమానిక దళంలో కల్నల్‌గా పనిచేశారు. ఆయన తండ్రి యుక్త వయస్సులోనే హైదరాబాద్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఈ రెండేళ్ల శిక్షణ కోసం 2017లో దాదాపు 18వేల మంది పోటీ పడ్డారు. 2024 నాటికి చంద్రుడి ఉపరితలంపై మొదట మహిళను తర్వాత పురుషుడిని పంపాలని నాసా యోచిస్తోంది.

వీరికి అంతరిక్షంలో నడవటం, రోబోటిక్స్, అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ వ్యవస్థ, టీ-38 జెట్, రష్యా భాష వంటి నైపుణ్యాలు నేర్పించినట్లు సమాచారం.

ఇదీ చూడండి: హిమాచల్​: యంత్రాల లేమితో పెరిగిన మంచు కష్టాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details