భారత్ అమెరికాల మధ్య ప్రస్తుతమున్న బలమైన సంబంధాలకు మహాత్మ గాంధీ- మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ల వారసత్వం గొప్ప నిదర్శనమని చికాగోలో భారత కాన్సుల్ జనరల్ అమిత్ కుమార్ అభిప్రాయపడ్డారు. గాంధీ-కింగ్ లెగసీ(గాంధీ-కింగ్ల వారసత్వం) మొదటి రౌండ్ టేబుల్ సమ్మిట్లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఆసియా కుటుంబం(మెట్రోపాలిటన్ ఏషియన్ ఫ్యామిలీ) సేవల సహకారంతో ఫిబ్రవరి 26న కాంగ్రెస్ మల్టీ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ గాంధీ-కింగ్ లెగసీ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.
భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం. అమెరికా.. పురాతన ప్రజాస్వామ్యం దేశం. ఈ రెండు దేశాల మధ్య ఉన్నత సంబంధాలు గాంధీ-కింగ్ వారసత్వానికి గొప్ప నిదర్శనం.