వాణిజ్యానికి సంబంధించి ప్రపంచస్థాయి భారీ ఎజెండాను రూపొందించే సత్తా భారత్- అమెరికాకు ఉందని స్పష్టం చేశారు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్. భారత్-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కారానికి ఇరుదేశాలు పరస్పరం సహకరించుకొవాలన్నారు. భారత్- అమెరికా మధ్య మరింత భారీ స్థాయిలో వాణిజ్యం జరగాల్సిన అవసరం ఉందన్నారు.
'ఇండియా ఐడియాస్ సమ్మిట్'లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జైశంకర్ ఇరుదేశాల వాణిజ్య సంబంధాలపై మాట్లాడారు.
"భారత్-అమెరికా మధ్య ఆర్థిక సంబంధాల సంక్లిష్టతను నేను అర్థం చేసుకున్నాను. ఇది వెన్న, రొట్టెల సమస్య లాంటింది. అందువల్ల భారత్-అమెరికాలు తమ వాణిజ్య సమస్యల పరిష్కారానికి పరస్పరం సహకరించుకోవాలి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం మరింత భారీ స్థాయిలో జరిగేలా చూడాలి."
- జైశంకర్, భారత విదేశాంగమంత్రి