ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (India UNSC Pakistan) వేదికగా పాకిస్థాన్‌కు మరోసారి చురకలు (India slams Pakistan at UNSC) అంటించింది భారత్. తాజాగా జరిగిన సమావేశంలో.. మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్‌ను తీవ్రంగా తప్పుబట్టింది. ఐరాస వేదికగా పాక్.. భారత్‌పై ద్వేషపూరిత ప్రచారం చేస్తోందని దుయ్యబట్టింది. ఇవన్నీ మానుకొని తక్షణమే కశ్మీర్లో ఆక్రమించుకున్న ప్రాంతాలను పాక్ ఖాళీ చేయాలని స్పష్టం చేశారు ఐరాసలో భారత శాశ్వత కమిషన్ కౌన్సెలర్ డా. కాజల్ భట్.
''కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్ మొత్తం భారత్‌లో ఇప్పటికీ, ఎప్పటికీ అంతర్భాగమే. ఇది విడదీయరానిది. పాకిస్థాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలు కూడా ఇందులోకే వస్తాయి. అందుకే తక్షణమే.. పాకిస్థాన్ ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలి.''
- డా. కాజల్ భట్
పాకిస్థాన్ చేసిన పనికిమాలిన వ్యాఖ్యల (India slams pakistan) వల్ల తాను మరోసారి మాట్లాడవలసి వచ్చిందని అన్నారు భట్. ఐరాస వంటి అంతర్జాతీయ వేదికలను పాక్.. భారత్‌పై దుష్ప్రచారం చేసేందుకే వాడుకుంటున్నాయని ఆమె ఆరోపించారు.
ఉగ్ర అడ్డా పాక్..