తెలంగాణ

telangana

ETV Bharat / international

యూఎన్​ఎస్​సీలో భారత్​ సరికొత్త అధ్యాయం

ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ నేటి నుంచి వ్యవహరించనుంది. 2021-22 సంవత్సర కాలపరిమితిలో.. 15 సభ్యదేశాల జాబితాలో భారత్​ కూడా ఉంది. ఈ నేపథ్యంలో.. ఉగ్రవాదాన్ని అరికట్టడం, శాంతిని నెలకొల్పడంపై వంటి అంశాల్లో భారత్​ కీలకంగా వ్యవహరిస్తుందని ఐరాసలో భారత రాయబారి అన్నారు.

India set to begin its two-year tenure as non-permanent member of UNSC
'సభ్యదేశాల మధ్య మరింత సహకారం అవసరం'

By

Published : Jan 1, 2021, 6:04 PM IST

బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశంగా.. ప్రాథమిక హక్కుల వంటి మౌలిక విలువలను ప్రోత్సహించడం, అభివృద్ధి, బహుళత్వాన్ని బలోపేతం చేయడానికి భారత్​ కృషి చేస్తుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో భారత శాశ్వత రాయబారి టీఎస్​ తిరుమూర్తి పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో శుక్రవారం నుంచి తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ వ్యవహరించబోతున్న నేపథ్యంలో.. సభ్యదేశాల మధ్య మరింత సహకారం అవసరమని ఉద్ఘాటించారు.

''ఐరాసలాగే భారత్​ కూడా ఐకమత్యాన్ని ప్రోత్సహిస్తోంది. నిర్ణయాలు తీసుకోవడంలో పాక్షికంగా వ్యవహరించడం, ముఖ్యమైన సమస్యలపై దృష్టి కేంద్రీకరించకుండా ఉండటానికి భద్రతా మండలి వేదిక కాకూడదని భారత్​ బలంగా చెబుతోంది. రానున్న రెండేళ్ల కాలం పాటు భద్రతా మండలిలో .. ఉగ్రవాదాన్ని అరికట్టడం, శాంతిని నెలకొల్పడం, బహుళత్వంలో సంస్కరణలు తదితర సమస్యల పరిష్కారానికి భారత్​ ప్రాధాన్యమిస్తుంది. భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉండే అర్హత భారత్​కు ఉంది. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో సభ్యదేశాలన్నీ ఒకేతాటిపై నిలవాలి. అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి భద్రతా మండలిలలో భారత్​ బలమైన స్వరం అవుతుంది.''

- టీఎస్​ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత రాయబారి

భద్రతా మండలిలో భారత్​ తాత్కాలిక సభ్యదేశంగా ఉండటం ఇది ఎనిమిదో సారి. 2021-22 కాలానికి ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా భారత్​ అత్యధిక మద్దతుతో గెలిచింది. 192 ఓట్లలో 184 వచ్చాయి.

2021 ఆగస్టులో ఓసారి, 2022లోనూ ఓ నెల ఐరాస భద్రతా మండలికి భారత్​ అధ్యక్షత వహించనుంది.

శాశ్వత సభ్యత్వంపై..

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్​ దశాబ్దాలుగా పోరాడుతోంది. అయితే 21వ శతాబ్దపు భౌగోళిక, రాజకీయ పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవు. భద్రతా మండలిలో పది తాత్కాలిక సభ్యదేశాలకు సంబంధించి.. ఏటా ఐదు స్థానాలకు రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరుగుతాయి. ఈ పది దేశాలను ప్రాంతీయత ఆధారంగా నిర్ణయిస్తారు. ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఐదు స్థానాలు, తూర్పు ఐరోపాకు ఒకటి, లాటిన్​ అమెరికా, కరీబియన్​కు సంయుక్తంగా రెండు, పశ్చిమ ఐరోపా, మిగతా దేశాలకు కలిపి 2 స్థానాలు కేటాయిస్తారు.

చైనా, ఫ్రాన్స్​, రష్యా, యూకే, అమెరికా శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి.

ఇదీ చూడండి:భద్రతా మండలిలో భారత్​కు​ శాశ్వత హోదా ఎలా?

ABOUT THE AUTHOR

...view details