తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా మహమ్మారికి ముకుతాడు.. భారత్​ భేష్!​' - ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచదేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతోందని, ముఖ్యంగా భారత్​లో కేసులు భారీగా తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొంది. ఐరోపాలో మాత్రమే కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు వెల్లడించింది.

India reports 18% decrease in numbers of new COVID19 cases
ప్రపంచదేశాల్లో తగ్గుతున్న కేసులు

By

Published : Oct 20, 2021, 2:22 PM IST

అక్టోబర్​ 11-17 మధ్య వారం వ్యవధిలో భారత్​లో లక్షా 14 వేల కరోనా కేసులు వెలుగుచూసినట్లు తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 18 శాతం తక్కువేనని వెల్లడించింది. మరణాల్లోనూ 13 శాతం మేర క్షీణత కనిపించిందని స్పష్టం చేసింది.

ఐరోపా మినహా ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కొవిడ్​ కొత్త కేసులు తగ్గాయని.. డబ్ల్యూహెచ్​ఓ ప్రతి వారం విడుదల చేసే తన ఆరోగ్య నివేదికలో స్పష్టం చేసింది.

అమెరికాలో ఒక్క వారంలోనే 5 లక్షల 80 వేల కేసులు నమోదయ్యాయని, ఇది 11 శాతం తక్కువేనని తెలిపింది. ఇదే సమయంలో యూకేలో 14 శాతం మేర కొత్త కేసులు పెరిగాయని వెల్లడించింది.

డబ్ల్యూహెచ్​ఓ ప్రకారం..

  • వారం వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు 27 లక్షలు. మరణాలు 46 వేలకుపైనే.
  • ఐరోపా ప్రాంతంలో 7 శాతం పెరిగిన కొత్త కేసులు
  • ఆఫ్రికాలో అత్యధికంగా కేసుల్లో 18 శాతం, మరణాల్లో 25 శాతం తగ్గుదల
  • వెస్టర్న్​ పసిఫిక్​ ప్రాంతంలో 16 శాతం మేర తగ్గిన కేసులు.
  • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 24 కోట్లకుపైగా కేసులు, 49 లక్షలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

కొవాగ్జిన్​కు అనుమతిపై..

కరోనా వ్యాక్సిన్​.. భారత్​ బయోటెక్​ (WHO on Covaxin) అత్యవసర వినియోగ అనుమతుల గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయతో ఫోన్​లో మాట్లాడారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ ఆంటోనియో గుటెరస్​. ఇంకా సీరం ఇన్​స్టిట్యూట్​ దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనెకా టీకాను.. కొవ్యాక్స్​కు సరఫరా చేసే అంశంపైనా చర్చించారు.

కరోనా నివారణ, డబ్ల్యూహెచ్​ఓ సంస్కరణలు సహా ఆరోగ్యం సంబంధిత అంశాలపై డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​తో సమగ్ర చర్చ జరిగిందని ట్వీట్​ చేశారు మాండవీయ.

కొవాగ్జిన్‌ టీకాపై మరికొంత సమాచారం రావాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్​ 18న వెల్లడించింది. అత్యవసర వినియోగానికి అనుమతించే ముందు దాని పనితీరు, భద్రతను పూర్తిస్థాయిలో విశ్లేషించాల్సి ఉంటుందని ట్వీట్‌లో పేర్కొంది. అక్టోబర్​ 26న సాంకేతిక సలహా బృందం మరోసారి సమావేశమై.. కొవాగ్జిన్​ అనుమతుల గురించి చర్చించనున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్​ సౌమ్య స్వామినాథన్​ తెలిపారు.

వ్యాక్సిన్​కు సంబంధించి ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ సంస్థ(Bharat biotech covaxin) ఏప్రిల్‌లో ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ సమర్పించింది. అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చేందుకు కొవాగ్జిన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే జులై 6న వ్యాక్సిన్ డేటా రోలింగ్‌ ప్రక్రియ ప్రారంభించినట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

ఇవీ చూడండి:Covid Cases In India: దేశంలో మరో 14,862 మందికి కరోనా

'కొవాగ్జిన్‌ టీకాపై మరికొంత సమాచారం అందాలి'

ABOUT THE AUTHOR

...view details