ప్రపంచ ఆర్థికాన్ని కరోనా మహమ్మారి కుదిపేసిన సమయంలోనూ భారత్కు విదేశాల నుంచి ప్రవాసీలు పంపే సొమ్ము పెద్దగా తగ్గలేదు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. విదేశాల్లోని ప్రవాసుల నుంచి అత్యధిక సొమ్ము అందుకుంటున్న దేశంగా తన స్థానాన్ని భారత్ నిలబెట్టుకుంది. 2020లో ప్రవాసుల నుంచి 83 బిలియన్ డాలర్లను(రూ.6.11 లక్షల కోట్లు) భారత్ అందుకుంది.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 0.2 శాతం తక్కువే అయినప్పటికీ కరోనా మహమ్మారి వంటి పరిస్థితుల్లో ఈ స్థాయిలో సొమ్ములు అందడం విశేషం. 2019లో 83.3 బిలియన్ డాలర్లు భారత్కు వచ్చాయి. అయితే యూఏఈ నుంచి వచ్చే సొమ్ము మాత్రం 2020లో 17శాతం పడిపోయింది. అమెరికా సహా ఇతర దేశాల నుంచి చెల్లింపులు పెరగడం.. ఈ లోటును భర్తీ చేసినట్లైంది.
రెండో స్థానంలో చైనా