సరిహద్దుల్లో చైనా చేస్తున్న కవ్వింపులను సమర్థంగా తిప్పికొట్టే శక్తి భారత్‌కు ఉందని అమెరికా అభిప్రాయపడుతోంది. ఇతర దేశాల మద్దతుతో దృఢమైన భారత దేశమే చైనాకు అడ్డుకట్టవేయగలదని అంచనా వేస్తోంది.
చైనాను తిప్పికొట్టే శక్తి భారత్‌కే ఉంది: అమెరికా - ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక విధానం
విస్తరణవాదంతో దుశ్చర్యలకు పాల్పడుతున్న చైనాను సమర్థంగా తిప్పికొట్టే శక్తి భారత్‌కే ఉందని అభిప్రాయపడుతోంది అమెరికా. భద్రతా వ్యవహారాల్లో భారత్ ఎంచుకోవాల్సిన భాగస్వామి అమెరికాయేనని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియెన్ తెలిపారు.

ట్రంప్ ప్రభుత్వం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక విధానం అనే అంశంపై రూపొందించిన పది పేజీల రహస్య నివేదికను జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియెన్ బహిర్గతం చేశారు. దీన్ని శ్వేతసౌధం వెబ్‌సైట్‌లో పెట్టారు. "భద్రత వ్యవహారాల్లో భారత్ ఎంచుకోవాల్సిన భాగస్వామి అమెరికాయే. దక్షిణ, ఆగ్నేయ ఆసియా, పరస్పర ప్రయోజనాలు ఉన్న ఇతర ప్రాంతాల్లో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయడానికి రెండు దేశాలూ పరస్పరం సహకరించుకోవాలి. చైనాను అడ్డుకునే శక్తి భారత్‌కు ఉంది" అని పేర్కొంది.
ఇదీ చూడండి:10వేల మంది చైనా సైనికులు వెనక్కి!