ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా భారత్ తమకు గొప్ప భాగస్వామ్య దేశం అని శ్వేతసౌధం తెలిపింది. ఆర్థికం, భద్రత, వ్యూహాత్మక అంశాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్నామని శ్వేతసౌధం మీడియా సెక్రటరీ జెన్ సాకి తెలిపారు.
" ప్రాంతాల పరంగానే కాదు ప్రపంచవ్యాప్తంగానూ భారత్ అమెరికాకు గొప్ప భాగస్వామ్య దేశం. పలు అంశాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్నాం."
-- జెన్ సాకి, శ్వేతసౌధం మీడియా సెక్రటరీ