అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులపై భారత్ ఆందోళనతో (India Afghanistan relations) ఉందని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. అఫ్గాన్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులపై భారత్‌కు (Afghan India news) అవగాహన ఉందని, ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు విఘాతం కలుగుతుందని ఆ దేశం భావిస్తోందని పెంటగాన్ ఉన్నతాధికారి కొలిన్ హెచ్ కాల్ వివరించారు. ఈ మేరకు అఫ్గాన్, దక్షిణ మధ్యాసియా భద్రతపై సెనేట్ సాయుధ సేవల కమిటీలో జరిగిన విచారణకు హాజరైన ఆయన.. చట్టసభ్యులకు తాజా పరిస్థితుల గురించి సమాచారం అందించారు.
"ఈ సమస్యపై వారు(భారతీయులు) మనతో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు. నిఘా వివరాలను పంచుకోవడం సహా, అవసరమైన చోట్ల మనం సహకారం అందించాలి. భారత్, అమెరికా (India US) కలిసి పనిచేస్తే ఇరుదేశాలకు ప్రయోజనకరం. అఫ్గానిస్థాన్, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల విషయంలోనే కాకుండా హిందూ మహాసముద్రంలో విస్తృతమైన ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఇరుదేశాల (India US news) మధ్య సహకారం చాలా ముఖ్యం."
-కొలిన్ హెచ్ కాల్, డిఫెన్స్ పాలసీ అండర్ సెక్రెటరీ