తెలంగాణ

telangana

ETV Bharat / international

'రోహింగ్యాల తీర్మానంపై భారత్​కే అధికారం' - రోహింగ్యాల తీర్మానం

బంగ్లాదేశ్​లో తలదాచుకుంటున్న 11 లక్షల మంది రోహింగ్యాలను స్వస్థలానికి పంపించే తీర్మానంలో ఎక్కువ అధికారం భారత్​కే ఉందని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్​ తిరుమూర్తి స్పష్టం చేశారు. బంగ్లాదేశ్​, మయన్మార్​లు భారత్​తో అత్యధిక సరిహద్దు కలిగి ఉన్నాయన్నారు. ఐరాస సాధారణ సభలో ఆయన ప్రసంగించారు.

India has highest stake in resolution of Rohingyas' return from Bangladesh to Myanmar: India at UNGA
'రోహింగ్యాల తీర్మానంపై భారత్​కే అధికారం'

By

Published : Feb 27, 2021, 4:31 PM IST

రోహింగ్యాల సమస్యపై ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్​ తిరుమూర్తి. బంగ్లాదేశ్​లో తలదాచుకుంటున్న రోహింగ్యాలను తిరిగి మయన్మార్​ పంపించే తీర్మానంలో ఎక్కువ అధికారం తమకే ఉందన్నారు. ఐరాస సాధారణ సభలో ఆయన ప్రసంగించారు. బంగ్లాదేశ్​, మయన్మార్​లు ఎక్కువ సరిహద్దును పంచుకునే దేశం భారత్​​ అని స్పష్టం చేశారు. మయన్మార్ రాఖైన్ రాష్ట్రం నుంచి వచ్చిన దాదాపు 11లక్షల నిరాశ్రయ రోహింగ్యాలు బంగ్లాదేశ్ కోక్స్​ బజార్​లో తలదాచుకుంటున్నారు.

"రోహింగ్యాల సమస్యపై త్వరతగతిన తీర్మానం చేయటం ఎంతో ముఖ్యం. స్థానిక ప్రజల అభివృద్ధికి మద్దతివ్వాల్సిన అవసరం ఉంది. రోహింగ్యాల సమస్యలను పరిష్కరించటంలో ఉన్న సవాళ్లపై ప్రపంచ దేశాలు కృషి చేయాలి. ఇరు దేశాల ప్రభుత్వాలకు భారత్​ సాయం చేస్తుంది. సుమారు 11 లక్షల రోహింగ్యాలకు ఆతిథ్యం ఇచ్చిన బంగ్లాదేశ్​ మానవతకు ప్రపంచ దేశాలు మద్దతివ్వాలి."

--- టీఎస్​ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత రాయబారి

రోహింగ్యాలను తమ దేశస్థులుగా మయన్మార్​ గుర్తించటం లేదు.. వాళ్లు బంగ్లాదేశ్​కు చెందిన వలసవాదులని ఆరోపిస్తోంది. తమ దగ్గర ఉన్న దాదాపు 10 లక్షలకు పైగా నిరాశ్రయ రోహింగ్యాలను తిరిగి మయన్మార్​ పంపించాలని బంగ్లాదేశ్ సర్కార్​ సంసిద్ధమైన సమయంలోనే అక్కడ మిలిటరీ ప్రభుత్వం అధికారం చేపట్టింది.

ఇదీ చదవండి :'ముస్లింల రాక' నిషేధంపై కాంగ్రెస్​లో మళ్లీ బిల్లు

ABOUT THE AUTHOR

...view details