భారత్- అమెరికా మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని బైడెన్ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టోనీ బ్లింకన్ పేర్కొన్నారు. బైడెన్ యంత్రాంగంలో ఆయన నియామకం సందర్భంగా సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీతో మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. బ్లింకన్ ఒబామా హయాంలో విదేశాంగ మంత్రిగా.. బైడెన్ ఉపాధ్యక్షతన జాతీయ భద్రత సలహాదారుగా సేవలు అందించారు.
భారత్తో బంధం బిల్ క్లింటన్ హాయం ముగిసే నాటికి బలపడింది. ఒబామా అధికారంలో ఉండగా రక్షణ, సమాచారం విభాగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారం మెరుగైంది. అదే ట్రంప్ హయాంలో కూడా కొనసాగింది. ఇందుకు అదనంగా ఇండో పసిఫిక్ అంశంపై కూడా ఇరుదేశాలూ కృషి చేస్తున్నాయి. ఈ బంధం మరింత బలపడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
-టోనీ బ్లింకన్