కరోనాను భూప్రపంచం నుంచి తరిమికొట్టేందుకు భారత్ (India covid fight) ముఖ్య పాత్ర పోషిస్తుందని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ (USAID Samantha power) అడ్మినిస్ట్రేటర్ సమంత పవర్ పేర్కొన్నారు. టీకా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు భారత్ చాలా కాలంగా పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. టీకా కొరత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా నిలుస్తోందని అన్నారు. (India US covid cooperation)
"ఈ భూమ్మీద కరోనా మహమ్మారిని (Covid 19 news) అంతం చేయడంలో భారతదేశం అత్యంత కీలక పాత్ర పోషించనుంది. టీకా తయారీ సామర్థ్యాలపై దీర్ఘకాలంగా భారత్ పెట్టిన పెట్టుబడులు, ఆ దేశ ఆవిష్కరణలు ఇందుకు దోహదం చేస్తాయి. ప్రస్తుతం మనం చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. టీకా కొరత తీవ్రంగా వేధిస్తోంది. భారత్ త్వరలోనే టీకాలను ఎగుమతి చేయనుంది."