ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్కు శాశ్వత సభ్యదేశంగా చోటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. భారత్తో పాటు జర్మనీ, బ్రెజిల్, జపాన్లకూ శాశ్వత సభ్యదేశాల హోదా కల్పించాల్సిన అవసరముందని తెలిపింది.
ప్రపంచ దేశాలకు తగిన ప్రాతినిధ్యం లభించాలంటే భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఐరాసలో ఫ్రాన్ శాశ్వత ప్రతినిధి ఫ్రానోయిస్ డెలాట్రే స్పష్టం చేశారు.
సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐరాస భద్రతా మండలి పరిధిని విస్తరించాల్సిన అవసరముందని ఫ్రాన్స్ అభిప్రాయపడింది.
"తాజా పరిస్థితుల్లో భారత్, జర్మనీ, బ్రెజిల్, జపాన్, ఆఫ్రికా దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ఈ అంశం ఫ్రాన్స్ వ్యూహాత్మక విధానాల్లో అత్యంత ప్రాధాన్య అంశం." - డెలాట్రే, ఐరాసలో ఫ్రాన్స్ శాస్వత ప్రతినిధి