ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉన్న సవాళ్ల నేపథ్యంలో భారత్‌ను కీలక భాగస్వామిగా అమెరికా భావిస్తోందని పెంటగాన్ ప్రకటించింది. 'క్వాడ్' కూటమి(భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా బృందం) రక్షణ మంత్రుల సమావేశం గురువారం వర్చువల్‌గా జరగనున్న నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అమెరికా కాలమానం ప్రకారం గురువారం జరగనుంది.
ఈ ప్రాంతంలో పెరుగుతున్న రక్షణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపిన అమెరికా, కరోనాపై పోరు, వాాతావరణ మార్పులు వంటి అంశాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్తామని తెలిపింది.