తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాకు వ్యతిరేకంగా యూఎన్​ఎస్​సీలో తీర్మానం- మరోసారి ఓటింగ్​కు భారత్ దూరం - యూఎన్​ఎస్​సీ తీర్మానం

UNSC Vote India: రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్​కు భారత్ దూరంగా ఉంది. చర్చలు, దౌత్యపరంగా మాత్రమే సమస్యను పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడింది.

India abstains on procedural resolution
ఓటింగ్​కు భారత్ దూరం

By

Published : Feb 28, 2022, 3:55 AM IST

Updated : Feb 28, 2022, 5:47 AM IST

UNSC Vote on Russia:ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకున్న నేపథ్యంలో అమెరికా తదితర దేశాల కూటమి ప్రత్యామ్నాయ చర్యలు ముమ్మరం చేసింది. ఇదే అంశంపై చర్చించేందుకు 199 సభ్య దేశాలున్న ఐరాస సర్వప్రతినిధి సభ అసాధారణ, అత్యవసర ప్రత్యేక సమావేశానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు 15 సభ్య దేశాల భద్రతా మండలి ఓటింగ్‌లో పాల్గొన్నాయి.

ఈ తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లతో ఆమోదం లభించింది. దీంతో సోమవారం సర్వసభ్య సమావేశం జరగనుంది. అయితే ఉక్రెయిన్‌పై జనరల్ అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చేందుకు భారత్, చైనా, యూఏఈలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. 1950 తర్వాత సాధారణ అసెంబ్లీలో ఇది 11వ అత్యవసర సమావేశం మాత్రమే.

బెలారస్ సరిహద్దులో రష్యా, ఉక్రెయిన్ చర్చలు జరిపేందుకు ముందుకు రావడం పై భారత్​ హర్షం వ్యక్తి చేసింది. చర్చలపై ఇరు పక్షాలు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్‌లో చిక్కుకుని ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతపై తాము ఇంకా ఆందోళన చెందుతున్నట్లు ఐరాసలో భారత శాశ్వత రాయబారి టి.ఎస్‌.తిరుమూర్తి వివరించారు.

ఇదీ చూడండి:

రష్యాతో చర్చలకు ఉక్రెయిన్​ అంగీకారం- వేదిక అదే..

Last Updated : Feb 28, 2022, 5:47 AM IST

ABOUT THE AUTHOR

...view details