తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​లో కరోనా కట్టడికి అదే గేమ్​ఛేంజర్​'

భారత్​లో కరోనా కట్టడిపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచితే మహమ్మారిని నివారించే అవకాశముందని పేర్కొంది.

increase in covid vaccines, covid vaccine production india
భారత్​లో టీకా ఉత్పత్తిపై అమెరికా కామెంట్​

By

Published : Jun 4, 2021, 8:10 AM IST

Updated : Jun 4, 2021, 11:10 AM IST

టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భారత్​లో కరోనాను కట్టడి చేయవచ్చని అమెరికా అభిప్రాయపడింది. 'మహమ్మారి విజృంభణ భారత్​పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమయంలో అక్కడ టీకా ఉత్పత్తిని పెంచితే వైరస్​ నిర్మూలనకు అది గేమ్​ఛేంజర్​గా మారే అవకాశముంది​,' అని అగ్రరాజ్య విదేశాంగ ప్రతినిధి నెడ్​ ప్రైస్​ పేర్కొన్నారు.

కొన్ని నెలల క్రితం క్వాడ్​ తొలి వర్చువల్​ సమావేశంలో భాగంగా భారత్​లో టీకాల ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు కృషి చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్​లు నిర్ణయించాయి.

టీకాల పంపిణీ..

భారత్​ సహా ఇతర దేశాలకు తొలి విడతగా 2.5 కోట్ల వ్యాక్సిన్​లను పంపిణీ చేస్తామని అమెరికా ఇటీవల ప్రకటించింది. నెలాఖరులోగా 5.5 కోట్ల టీకాలను ప్రపంచ దేశాలకు పంపిణీ చేయాల్సి ఉందని నెడ్​ ప్రైస్​​ వెల్లడించారు.

కరోనాపై పోరులో భాగంగా.. ఇప్పటివరకు అమెరికా భారత్​కు 500 మిలియన్​ డాలర్ల సాయాన్ని అందించింది.

భారత్‌కు అధిక ప్రయోజనం..

అమెరికా టీకాలు భారత్‌కు అందనున్నట్లు ఆ దేశంలోని భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు తెలిపారు. ఒకటి కొవాక్స్‌ ద్వారా కాగా.. మరొకటి నేరుగా పొరుగు, మిత్ర దేశాలకు అందించే మార్గాన అని వెల్లడించారు. తొలుత కొవాక్స్‌ ద్వారా భారత్‌కు టీకాలు రానున్నట్లు పేర్కొన్నారు. అలాగే రక్షణ ఉత్పత్తుల చట్టం నుంచి కొన్ని సడలింపులు ప్రకటించడం ద్వారా ఇకపై నొవావాక్స్‌, ఆస్ట్రాజెనెకా టీకాల సరఫరా సాఫీగా సాగనున్నట్లు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి :ప్రధాని మోదీకి కమల హారిస్ ఫోన్- టీకాపై చర్చ

Last Updated : Jun 4, 2021, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details