తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రమాణస్వీకారోత్సవ విందులో కమలకు ఇష్టమైన 'గంబో' - సీఫుడ్

అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం రోజు అతిథులకు వడ్డించే విందు పసందైన వంటకాలతో నోరూరించనుంది. కమలా హారిస్​కు ఎంతో ఇష్టమైన సీఫుడ్​ను ప్రధానంగా వడ్డించనున్నారు. శాన్​ఫ్రాన్సిస్కోకు చెందిన రాబర్ట్ డోర్సేకు ఈ క్యాటరింగ్​ ఆర్డర్ దక్కింది. కమల, డోర్సేలు చిన్నప్పుడు ఒకే పాఠశాలలో చదువకోవడం గమనార్హం.

Inauguration Day dinner features Kamala Harris' favourite dish
కమలా హారిస్​ అభిరుచులకు తగ్గట్టుగా అధికారిక విందు!

By

Published : Jan 19, 2021, 10:46 AM IST

అమెరికా నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బైడెన్​, కమలా హారిస్​లు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల కోసం ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. కమలా హారిస్​ అమితంగా ఇష్టపడే సీఫుడ్​ 'గంబో' మెనూలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ క్యాటరింగ్​ ఆర్డర్​ శాన్​ఫ్రాన్కిస్కోకు చెందిన ప్రముఖ చెఫ్​ రాబర్డ్ డోర్సేకు దక్కింది.

గంబో అంటే క్యాప్సికం, ఉల్లిపాయలు, మాంసం లేదా షెల్​ఫిష్​తో చిక్కగా తయారు చేసే సూప్​. కమల ఈ వంటకాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు. ఇది అధికారికంగా లూసియానా రాష్ట్ర వంటకం కూడా కావడం విశేషం.

పాత స్నేహితులు..

ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్​, తాను బెర్కిలీలోని థౌసండ్ ఓక్స్​ ఎలిమెంటరీ స్కూల్​లో చదువుకున్నట్లు డోర్సే తెలిపారు. ఇద్దరికీ ఫస్ట్​ గ్రేడ్​ టీచర్​ ఫ్రాన్సెస్​ విల్సన్​ అని చెప్పారు. ఈ విషయం తనకు ఐదేళ్ల క్రితమే తెలిసిందని వెల్లడించారు. విల్సన్​ తన జీవితంలో ముఖ్య మార్గదర్శకురాలని పేర్కొన్నారు.

ఇద్దరికీ ఒకే టీచర్ బోధించడం ఒక విశేషమైతే.. తామిద్దరం గంబో వంటకాన్నే అమితంగా ఇష్టపడటం మరో విశేషమని డోర్సే చెప్పారు. అందుకే ఈ వంటకాన్ని ప్రమాణస్వీకారోత్సం రోజు అతిథులకు ఇచ్చే విందు మెనూలో ప్రత్యేకంగా చేర్చినట్లు తెలిపారు. కొత్త పాలనా యంత్రంగానికి పసందైన విందు సమకూర్చడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు డోర్సే ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకను ఘనంగా జరుపుకోవడం కోసం ఒక రోజు ముందు నుంచే భోజనప్రియులకు వీటిని అందుబాటులో ఉంచుతామన్నారు.

కమలా హారిస్​ అభిరుచులకు తగ్గట్టుగా అధికారిక విందు!

ప్రమాణస్వీకారోత్సవం రోజు అతిథులకు ఇచ్చే విందు మెనూ ఐటమ్స్​

అప్పెటైజర్​..

పాంకో క్రస్టెసడ్​ క్రాబ్​ కేక్స్​

ఆర్గానిక్ కోస్టల్ గ్రీన్స్​ అండ్​ కాజున్ రిమౌలేడ్​

ఎంట్రీ..

బేయూ ష్రింప్​ సాసేజ్​ గంబో

లూసియానా లవ్​, డీప్​ యాంబర్​ రౌక్స్​, స్వీట్ పెప్పర్స్​, బ్లాకెన్డ్​ చికెన్​, జలాపినో, ప్రెష్​ క్రాబ్స్, హాట్ లింక్స్, ష్రిర్​ ఓక్రా, ఫ్రాగ్రాంట్​ వైట్​ రైస్​ టు స్టీమ్​ ఎట్ హోం.

స్వీట్

బనానా రైసిన్​ బ్రెడ్​ పడ్డింగ్​,

బౌర్​బన్​ కారామెల్​

కమలా హారిస్​ అభిరుచులకు తగ్గట్టుగా అధికారిక విందు!

ఇదీ చదవండి:మన కమలకు రంగవల్లికలతో స్వాగతం

ABOUT THE AUTHOR

...view details