తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రాంతీయ సవాళ్లపై గుటెరస్​తో జైశంకర్​ చర్చ - jai shankar meeting news

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​తో సమావేశం ఫలవంతంగా జరిగిందన్నారు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. ఈ భేటీలో భారత్​కు ప్రాంతీయ సవాళ్లు, ఉగ్రవాదం సహా భద్రతా మండలికి అధ్యక్షత వహించే వేళ దేశ ప్రాధాన్యతలపై చర్చించినట్లు తెలిపారు.

Jaishankar
ఎస్. జైశంకర్

By

Published : May 26, 2021, 6:52 AM IST

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​తో భేటీ సమగ్రంగా, ఫలప్రదంగా జరిగిందన్నారు విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్. మంగళవారం ప్రత్యక్షంగా ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో భారత్​కు పొరుగు దేశాలతో సవాళ్లు, ఉగ్రవాదం, మయన్మార్ సహా ఆగస్టులో ఐరాస భద్రతా మండలికి అధ్యక్షత వహించే సమయంలో దేశ ప్రాధాన్యతలపై చర్చించినట్లు ట్విట్టర్​లో జై శంకర్ వెల్లడించారు.

వాతావరణ మార్పులపైనా ఈ భేటీలో చర్చించినట్లు జైశంకర్ వెల్లడించారు. అయితే అందుకోసం ఎన్ని నిధులు వెచ్చించామనే అంశం మన నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. సముద్ర యాన భద్రత, శాంతి స్థాపనకు సాంకేతికత వినియోగం ప్రస్తుత అవసరాలని చెప్పారు.

ఇదీ చదవండి: సీబీఐ డైరెక్టర్​గా సుబోద్​ కుమార్​ జైస్వాల్​

ABOUT THE AUTHOR

...view details