తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉపాధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో అనుకోని అతిథి - అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020

ఓ వైపు వాడీవేడి చర్చ జరుగుతోంది. ఇంతలో అమెరికా ఉపాధ్యక్షుడ్నే ఇబ్బంది పెట్టింది ఓ అతిథి. ఎన్ని సార్లు వారించినా వినలేదు. ఇంతకీ ఎవరా అతిథి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే.

In VP debate, plexiglass an extra participant on the stage
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య అనుకోని అతిథి

By

Published : Oct 8, 2020, 12:17 PM IST

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్​లో అనుకోని అతిథి వచ్చింది. ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​, డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​ మధ్య సంవాదం నడుస్తోన్న వేళ ఓ అతిథి అందరి దృష్టిని ఆకర్షించింది.

కమల ప్రశ్నలకు పెన్స్​ సమాధానం చెబుతున్న వేళ ఓ ఈగ పలుమార్లు ఆయన తలపై వాలింది. జాతి వివక్షపై జవాబులిస్తోన్న వేళ పెన్స్​ను ఈగ ఇబ్బంది పెట్టింది. అయితే ఈ డిబేట్​ను ఆన్​లైన్​లో చూస్తోన్న పలువురు సంవాదం కంటే ఈగ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. నెట్టింట్లో సరదా కామెంట్లు పెట్టారు.

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య అనుకోని అతిథి

అయితే కొంతమంది ఈగకు కరోనా పరీక్ష నిర్వహించాలని ట్వీట్స్​ చేశారు. పెన్స్​, కమల మధ్య ఉన్న ప్లెక్సీగ్లాస్​ మధ్యలోనూ ఈ ఈగ పలుమార్లు తిరిగింది.

డిబేట్​ల మధ్య ఈగ ఇబ్బంది పెట్టడం ఇది తొలిసారి కాదు. 2016లో అధ్యక్ష అభ్యర్థుల డిబేట్​ మధ్య ఇలాంటిదే జరిగింది. అప్పటి డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటిపైనా పలుమార్లు ఈగ వాలి ఇబ్బంది పెట్టింది.

ప్లెక్సీ గ్లాస్...

కమలా హారిస్, మైక్​ పెన్స్​ మధ్య ఉన్న ప్లెక్సీ గ్లాస్​ అందరినీ ఆకర్షించింది. కరోనా వైరస్​ నిబంధనల్లో భాగంగా ఈ గ్లాస్​ను ఏర్పాటు చేశారు. పెన్స్​, హారిస్​కు మధ్య 12 అడుగుల దూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేశారు.

ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు కరోనా సోకిన కారణంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అతిథుల కోసం 20 కుర్చీలను మాత్రమే ఏర్పాటు చేశారు. కుర్చీల మధ్య ఆరు అడుగుల దూరం ఉంచారు.

ABOUT THE AUTHOR

...view details