అమెరికా సార్వత్రిక ఎన్నికల వేళ అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇంటి పోరు తలనొప్పిగా మారింది. ఆయన సోదరి, మాజీ ఫెడరల్ న్యాయమూర్తి మేరియానా బేరీ.. ట్రంప్‌పై విమర్శలు చేశారు. ఆయనకు ఎలాంటి విలువలు లేవని ఆరోపించారు. ట్రంప్ చర్యలను ఖండిస్తూ ఆమె మేనకోడలు మేరీ ట్రంప్ రాసిన పుస్తకంలో అధ్యక్షుడి వైఖరిపై అనేక విషయాలు చెప్పారు. 'టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్' అనే పుస్తకంలో 2018-19 సమయంలో ట్రంప్‌నకు, తన కుటుంబానికి మధ్య జరిగిన కొన్ని సంఘటనలను ఆమె బయటపెట్టారు. ఈ పుస్తకానికి 'హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ ది వరల్డ్ మోస్ట్ డేంజరస్ మ్యాన్' అనే ఉపశీర్షికను పెట్టారు.
ఎన్నికల ముందు అమెరికా అధ్యక్షుడికి ఇంటిపోరు! - latest international news
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన సోదరి మేరియానా బేరీ ట్రంప్. డొనాల్డ్‌కు విలువలు ఉండవని, ఆయన మనసు నిండా క్రూరత్వం నిండి ఉంటుందని మేరీ మేనకోడలు రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత కుటుంబం నుంచే ట్రంప్‌పై వ్యతిరేకత రావడం ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారింది.
'ట్రంప్ ఓ క్రూరుడు.. అతనికి విలువలు లేవు'
తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వలసదారుల పిల్లల కేసులను పర్యవేక్షించాల్సిందిగా తనకు ట్రంప్ సూచించినట్లు బేరీ చెప్పారు. అయితే ఇమ్మిగ్రేషన్ కేసులపై తన అభిప్రాయాలను ట్రంప్ ఎప్పుడూ పట్టించుకోలేదని ఆమె వివరించారు. ట్రంప్ మనసు క్రూరత్వంతో నిండి ఉంటుందని ఆయన సోదరి విమర్శించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ట్రంప్‌పై సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత రావడం ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారింది.